Hyderabad: కట్నం కోసం సొంత భార్యపై SI దారుణం.. !

-

కట్నం కోసం సొంత భార్యపై, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేయించాడు ఎస్ఐ. బంజారా్హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు చల్లా ప్రవీణ్ కుమార్. విజయవాడ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామానికి చెందిన చల్లా ప్రవీణ్‌కు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన రాజ్యలతతో వివాహం జరగగా కట్నం కోసం ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

SI ordered attack on his own wife and her family members for dowry
SI ordered attack on his own wife and her family members for dowry

పెళ్లి సమయంలో కట్నం కింద రూ.10 లక్షలు, 3 ఎకరాల భూమి, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు, ఒక ప్లాట్ ఇవ్వగా.. తన పేరు మీదకి 3 ఎకరాల భూమి, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు రిజిస్టర్ చేయలేదని కుటుంబంలో నిత్యం గొడవలు జరిగాయట. 6 నెలలుగా సొంతింటికి పంపకుండా ప్రవీణ్ కుమార్ చిత్ర హింసలు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది భార్య. పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా భార్యపై, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేయించాడు ఎస్ఐ చల్లా ప్రవీణ్ కుమార్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news