ఏలేరు వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని, మ్యాన్ మేడ్ మిస్టేక్ అని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ.. జగన్ చెప్పింది కరెక్టేనని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏమీ చేయలేదని.. కాబట్టి ఇది పూర్తిగా జగన్ మేడ్ మిస్టేక్ అని అన్నారు.
భారీ వర్షాలతో ఏలేరు పొంగి ప్రవహించిందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలతో ప్రాణ నష్టం సంభవించలేదని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17000 క్యూసెక్కుల ప్రవాహం వస్తేనే కాకినాడ వరకు నీళ్లు వెళ్ళాయని.. ఇప్పుడు 42 వేల క్యూసెక్కుల నీరు వచ్చిన ముందు చూపుతో నష్టాన్ని నివారించగలిగామని చెప్పుకొచ్చారు సోమిరెడ్డి.
జగన్ కి క్యూసెక్కులు, టిఎంసీలు, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో అంటే తెలియదని ఎద్దేవా చేశారు. ఆయన ప్యాలెస్ లో కూర్చుని పాలించారని.. జగన్ హయాంలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు నిర్వీర్యం అయిపోయాయని విమర్శించారు. ఇక అప్పటి జలవనరుల శాఖ మంత్రి డాన్సులకే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు.