ముగ్గులు వేస్తున్నవారిపై దూసుకొచ్చిన లారీ.. ఒకరు మృతి

-

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ భోగి పండుగను పురస్కరించుకుని ప్రజలంతా తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకుని మంటల చుట్టూ ఆడిపాడుతున్నారు. మరోవైపు మహిళలంతా వేకువజామునే వాకిట్లో రంగు రంగుల రంగవళ్లులు తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల ప్రమాదాలు జరిగి పండుగ పూట పలు కుటుంబాల్లో విషాదం నింపాయి.

ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో విషాదం చోటుచేసుకుంది. భోగి పండుగ సందర్భంగా వాకింట్లో ముగ్గులు వేస్తున్న వారిపై లారీ దూసుకొచ్చింది. ఇంటి ముందు అక్కా చెల్లెళ్లు పల్లవి దుర్గ, తేజస్విని అనే అక్కాచెల్లెళ్లు ముగ్గులు వేస్తుండగా లారీ దూసుకు రావడంతో తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో పల్లవి తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు స్థానికులు లారీ డ్రైవర్ను పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు పరారయ్యాడు. అయితే అతడితోపాటు ఉన్న మరొకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మరోవైపు తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కలగుంట వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కలగుంట జాతీయ రహదారిపై బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మునిరాజా(24), రాంకీ(25), గౌతమ్‌(23) మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version