విశాఖకు వచ్చే పర్యాటకులకు షాక్ ఇచచింది జగన్ సర్కార్. రుషికొండ బీచ్‌కు రూ.20 ఎంట్రీ టికెట్ తీసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. విశాఖ ఋషికొండ బీచ్ ప్రవేశానికి ఇకపై రుసుము తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
పర్యాటకులను ఆకట్టుకునే వాటిలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందింది రుషికొండ బీచ్. అయితే.. ఇప్పటివరకు రుషికొండ బీచ్ లో ప్రవేశం ఉచితంగా ఉండేంది. ఇకపై బీచ్ సందర్శన రుసుము రూ 20 గా నిర్ణయించింది ఏపీ పర్యాటకశాఖ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారి బీచ్ ప్రవేశానికి రుసుము వసూలు చేసేందుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే.. రుషికొండ బీచ్‌కు రూ.20 ఎంట్రీ టికెట్ తీసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న…నిర్ణయం పై పర్యాటకులు, ప్రతి పక్షాలు సీరియస్ అవుతున్నాయి.