11 సీట్లు వచ్చినా వారి బుద్ది మారడం లేదు : మంత్రి నిమ్మల

-

వైసీపీ నేత  వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం అవినీతికి మారుపేరు అని మంత్రి నిమ్మల రామానాయుడు  ఆరోపించారు. వంశీని సమర్ధిస్తున్న వైఎస్ జగన్ కూడా ఒక అరాచక శక్తి అని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా ఏ పార్టీ ఆఫీస్లపై దాడి జరగలేదు. కానీ టీడీపీ ఆఫీస్ పై వంశీ దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేసిన దళితుడిని కిడ్నాప్ చేసిన ఘనుడు అంటూ ఫైరయ్యారు. మహిళలు, దళితులు అంటే మాజీ సీఎం జగన్కు చిన్నచూపు ఉందని.. వారికంటే వంశీ లాంటి రౌడీలు ఆయనకు ఎక్కువయ్యారా? అని ప్రశ్నించారు.

ఈ క్రమంలో దళిత యువకుడిని బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేయడానికి వంశీ కుట్ర చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని వైఎస్ జగన్  ఎలా సమర్థిస్తారు అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తప్పును ఖండించాల్సింది పోయి.. వెనకేసుకొస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో గత వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు పునరావృతం కానివ్వబోమని మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు. ’11 సీట్లు వచ్చినా వైసీపీ నేతలు, వైఎస్ జగన్కు ఇంకా బుద్ధి రాలేదు’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news