మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి మనవడు విష్ణు-సాత్విక వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని సర్ణభారత్ ట్రస్ట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రులు నారా లోకేష్, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
వెంకయ్య నాయుడు మనవడు రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పాలి. పెళ్లి చాలా సంప్రదాయబద్దంగా నిర్వహించారు. పెల్లికు కూడా పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.