మాజీ మంత్రి జోగి కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అగ్రి గోల్డ్ భూముల వివాదంలో మాజీ మంత్రి జోగి కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భూములు కొని అమ్మినట్టు డీజీపీకి నివేదిక ఇచ్చారు బెజవాడ పోలీస్ కమిషనర్. భూ అక్రమాల అంశంపై సమగ్ర విచారణ జరిపిన బెజవాడ పోలీసులు…. డీజీపీకి నివేదిక ఇచ్చారు.
సీఐడీ అటాచ్ మెంట్ లో ఉన్న భూములను కొనుగోలు చేశారట జోగి కుమారుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరావు. 88 సర్వే నంబర్ లో ఉన్న భూములను కొని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 87వ సర్వే నంబర్ లో భూములు ఉన్నట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందినట్టు నివేదిక ఇచ్చారు పోలీసులు. డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్, గ్రామ్ సర్వేయర్ తో ఉద్దేశ పూర్వకంగా ఇచ్చినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ముగ్గురి రెవెన్యూ అధికారుల సస్పెన్షన్ అయ్యారు. డీజీపీకి నివేదిక చేయటంతో మొత్తం వ్యవహారంపై సీఐడీ విచారణ చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.