విశాఖలో భారీ పేలుడు సంభవించింది. ఈ పెను ప్రమాదం లో ముగ్గురు మృతి చెందారు. ఫిషింగ్ హార్బర్ ఏరియాలోని హిమాలయ బార్ వద్ద పేలింది గ్యాస్ సిలిండర్. వెల్డింగ్ పని చేస్తుండగా గ్యాస్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా .. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ఈ సంఘటన జరగగానే స్థానికులు అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కి తరలించారు. ఈ సంఘటన జరగడంతో స్థానికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఈ సంఘటన జరగడం వెనుక గల కారణాలను అన్వేషిస్తున్నారు పోలీసులు. ఈ పేలుడు సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.