హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. తరుణంలోనే మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద ప్రవాహం భారీగా పెరిగింది.

మరికాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లు తెరిచి మూసీ లోకి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అ ప్రమత్తం చేశారు అధికారులు. సహాయం కోసం 040-21111111 నంబర్‌ను సంప్రదించాలని సూచనలు చేశారు అధికారులు.
అటు భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వర్షపు నీరు వస్తోంది. దింతో హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటిమట్టం 1763 అడుగులుగా ఉంది. ఒక గేటు రెండు ఫీట్లు పైకి ఎత్తి మూసి నదిలోకి నీటి విడుదల చేశారు.