అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతల కార్మికులు అన్నారు. తెలుగుదేశం పార్టీకి, నేతన్నలకు అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. నేతన్నలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ చేనేత అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా… మరోవైపు ఏపీలోని మహిళలకు శుభవార్త అందజేశారు చంద్రబాబు నాయుడు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అమలులోకి తీసుకురానున్నారు. దీంతో ఏపీ మహిళలు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.