BREAKING : విశాఖలో ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏసీ బోగీల్లో మంటలు

-

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏసీ బోగీల్లో ఈ మంటలు వ్యాపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు. వారొచ్చేలోగా రైల్వే సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమించారు.

ఇక రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రైలు బోగీల్లోను మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో బీ 6, బీ 7, ఎం 1 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. అయితే ఆ సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది సాయంతో అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు షార్ట్సర్క్యూట్ వల్లే చెలరేగి ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version