నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీవో), మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. 4,455 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎస్సీ కేటగిరీ వారికి 657 పోస్టులు, ఎస్టీ – 332, ఓబీసీ – 1185, ఈడబ్ల్యూఎస్ – 435, యూఆర్ కేటగిరీ వారికి 1846 పోస్టులు కేటాయించారు. ఎందులోనైనా డిగ్రీ పొందిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఆగస్టు 21వ తేదీలోగా ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 2024 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగిన వారు అర్హులు. అభ్యర్థులకు ఈ ఏడాది సెప్టెంబరులో ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ ఇస్తారు.
ఫీజు వివరాలు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175
ఇతరులు రూ.850
బ్యాంకుల వారీగా పోస్టులు..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 885
కెనరా బ్యాంక్‌లో 750
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 260
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 200
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో 360
వీటితో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా పోస్టులున్నాయి.