వైసీపీ కారణంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు : మంత్రి కొలుసు పార్థసారథి

-

వైసీపీపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై కుట్రతో కొందరు అన్ని కార్యక్రమాల పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణంపై లబ్ధి దారులకు అన్యాయం చేసినట్టు ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రికలో అన్ని వక్రీకరణలు చేస్తున్నారని అన్నారు. రిజాయిండర్ ఇచ్చినా.. దాన్ని కూడా వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఘోరంగా హత్యకు గురైన వ్యక్తిని గుండె పోటుతో చనిపోయారని నమ్మించే ఓ పార్టీ పత్రిక నుంచి ఇంత కంటే ఎక్కువ ఊహించలేమని అన్నారు. వైసీపీ నిర్వాకం కారణంగా ప్రధాన మంత్రి అవాస్ యోజన 1.0 కింద లబ్ధిదారుల విషయంలో లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో ఎంపిక చేసిన 3.18 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను మార్చేసి వైసీపీ లబ్ధిదారుల సంఖ్యను సగానికి తగ్గించేసిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. అప్పుడు మిగిలిపోయిన వారికే కేంద్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్ తర్వాత ఇళ్లు మంజూరు అయ్యాయని అన్నారు. పేదవాళ్ళ ఇళ్ల నిర్మాణంకి సంబధించిన రూ.3,598 నిధులు కూడా గత ప్రభుత్వం మళ్లించింది.. పీఎంఎవై 1.0ను కేంద్రం 2027 వరకూ పొడిగించిందని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version