తెలంగాణ ఇటీవల కులగణన సర్వే చేసిన విషయం తెలిసిందే. అయితే కులగణన పూర్తి చేయలేదని.. కొంత మంది సర్వేకు సహకరించలేదని తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో వెల్లడించారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మళ్లీ సర్వే చేపడుతామని.. 3.1 శాతం మిగిలన వారందరూ సహకరించి సర్వేలో పాల్గొనాలని తెలిపారు భట్టి విక్రమార్క. ఈ సర్వేను మార్చి మొదటి వారంలో కేబినెట్ లో పెట్టనున్నట్టు వెల్లడించారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. “బీసీల జనాభాను తగ్గించి వారినితీవ్ర మానసిక వేదనకు గురి చేసిన సీఎం రేవంత్ రెడడ్ి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వే తప్పుల తడక అని ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. సమగ్రంగా సర్వే చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు జరపాలి. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు కాంగ్రెస్ ను బీసీలు ఎవ్వరూ నమ్మరని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి” అని ట్వీట్ చేశారు కేటీఆర్.