విజయవాడ అమ్మవారి దగ్గరికి కాలినడకన బయలుదేరిన రాజధాని రైతులు

-

Vijayawada Ammavari: నేడు తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు అమరావతి రాజధాని రైతులు. ఇందులో భాగంగానే… తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి రానున్నారు అమరావతి మహిళా రైతులు,రైతులు, రైతు కూలీలు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను చెల్లించుకోనున్నారు రాజధాని గ్రామాల రైతులు.

Farmers of the capital who set out on foot to Vijayawada Ammavari

పొంగళ్ళు నెత్తిన, అమ్మవారు ఫోటో చేత్తో పట్టుకొని కాలినడకన విజయవాడ అమ్మవారి దేవస్థానానికి రాజధాని రైతులు బయలు దేరారు. ఈ కార్యక్రమానికి రాజధాని 29 గ్రామాల నుంచి పాల్గొన్నారు రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు. 2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. నాడు మొక్కు చెల్లింపు పూర్తి కాకపోవడంతో నేడు చెల్లించేందుకు కాలినడకన బయలుదేరారు అమరావతి రైతులు. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి దేవస్థానానికి బయలుదేరారు అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version