ధాన్యం కొనుగోలులో రైతులకు మేలు జరిగేలా చూడాలి : సీఎం జగన్

-

వ్యవసాయం అనుబంధ రంగాలతో పాటు పౌరసరపరాల శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల సాగు తాజా పరిస్థితులను సీఎం కి అధికారులు వివరించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు సాధారణ వర్షపాతం నమోదయిందని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. జూన్ ఆగస్టు నెలలో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం పడిందని దీనివల్ల 73% మేర సాగైందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ముందస్తు రబీకి రైతులు సిద్ధమవుతున్నారు. దాదాపు పది లక్షల ఎకరాల్లో ముందస్తు రబీ పంటలు వేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. రబీలో సాగు చేసే శనగ విత్తనాలపై సబ్సిడీని 25% నుంచి 40 శాతానికి పెంచామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విత్తనాల పంపిణీ చాలా చురుకుగా సాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

సుమారు లక్షల క్వింటాళ్లు శనగ విత్తనాలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి కి చెప్పారు. ఇప్పటికే 45 వేల క్వింటాళ్ల పంపిణీ చేశామని అధికారులు స్పష్టం చేశారు. ఎరువుల అభ్యంతరం ఎలాంటి సమస్య లేదని అధికారులు పేర్కొన్నారు. రైతులు అవసరాలకు తాగిన విధంగా నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. దానం కొనుగోలు పై సీఎం జగన్ సమీక్షించారు. ఖరీఫ్ కు సంబంధించి ఇప్పటికే 85% పూర్తి చేశామని వెల్లడించారు అధికారులు. అక్టోబర్ 15లోగా నూరు శాతం ఈక్రాపింగ్ పూర్తి చేస్తామని తెలిపారు ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సమాయత్తమవుతున్నట్టు ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version