మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకి రేవంత్ రెడ్డి కౌంటర్..!

-

 తెలంగాణలో ఎన్నికల తేదీని ఈసీ ప్రకటించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరూ విమర్శలు చేసుకుంటున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి పై ట్వీట్ చేశాడు. “ప్రత్యర్థి పక్షాన్ని ఎదుర్కొనే దమ్ములేక, ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడే నువ్వు ప్రతిపక్ష నాయకుడివి కాదు.. రాజకీయ నాయకుడివి కాదు.. అసలు మనిషివే కాదు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం, కించపరచడం నీ నీచ ప్రవృత్తికి ఉదాహరణ. నీలాంటి వాడు తెలంగాణలో పుట్టడం మొత్తం తెలంగాణకే అవమానం. ఉదాత్తమైన సంస్కారం..ఆప్యాయత, అనురాగం నీలాంటి మరుగుజ్జులకు ఏం అర్థమవుతాయిలే”.. అని పేర్కొన్నాడు. 

ఇందుకు రేవంత్ రెడ్డి కూడా  కౌంటర్ వేశాడు.  దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్.. కొడుకుతో కొద్ది రోజల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా.. ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని, లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా? సర్కారు హాస్టళ్లలో మీరు పెట్టే తిండి తినలేక ఏడుస్తున్నారని తెలిసి అమ్మా నాన్నలు పడే ఆవేదన నీలా కాదనుకున్నావా? కొడుకు తిరిగిరాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా? మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన 30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన.. నీలా కాదనుకున్నావా? తిండిపెట్టక చిన్నారులని ఏడిపించి, ఫీజు బకాయిలివ్వక యువతని గోసపెట్టి, ఉద్యోగాలివ్వక నిరుద్యోగులని వంచించిన మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుంది.. అని కౌంటర్ వేశాడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version