కర్నూలులో యురేనియం తవ్వకాల కలకలం రేపింది. కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాల భయం నెలకొంది. యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్లకు కేంద్రం అనుమతి ఇవ్వడం జరిగింది. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో 6.8 హెక్టార్లలో తవ్వకాలకు అనుమతి ఇచ్చారని సమాచారం అందుతోంది.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆమోదం లభిస్తే తవ్వకాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. యురేనియం తవ్వకాల ప్రతిపాదనలపై గతంలోనే కప్పట్రాళ్ల వాసులు వ్యతిరేకించారు. గతంలో ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నిస్తే భూమా అఖిల ఆందోళనకు దిగారు. దీంతో పనులు ఆగిపోయాయి. ఇక ఇప్పుడు మళ్లీ కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాల భయం నెలకొంది.