ఆంధ్రప్రదేశ్ లోని పశు సంవర్థక శాఖలో ఖాలీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. సచివాలయంలో ఈరోజు పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జనవరి నెలాఖరు లోపు చేప పిల్లలను పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి.
రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి నివేదిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు. మత్స్యకారుల బోట్లకు ఇంధన రాయితీలతో ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పశు సంవర్థక శాఖలో ఖాలీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ అనుసంధానంతో పశువుల షెడ్ల నిర్మాణం, గడ్డి పెంపకం మరింత ఎక్కువ మంది లబ్దిదారులకు అందించేందుకు నివేదిక పంపాలని ఆదేశించారు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు.