AP : 597 గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీ..పూర్తి వివరాలు ఇవే

-

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది జగన్‌ సర్కార్‌. 597 గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్‌ ఇచ్చింది జగన్‌ సర్కార్‌. గ్రూప్ -1లో 89, గ్రూప్-2లో 508 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా భర్తీ వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖలకు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.

గ్రూప్-2 విభాగంలో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కింద ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు-23, జిఏడీలో 161, లా డిపార్ట్మెంట్ 12, లెజిస్లేచర్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-10, డిప్యూటీ తహసిల్దార్(గ్రేడ్ 2) 114, ఎక్సైజ్ ఎస్సై 150, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 18, సబ్ రిజిస్ట్రార్ (గ్రేడ్ 2) 16, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 3) 4 పోస్టులు భర్తీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version