చంద్రబాబు డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు – రవిబాబు

-

 

చంద్రబాబు డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని సినీ దర్శకుడు రవిబాబు పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే.. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తరుణంలో చాలా మంది స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. సినీ దర్శకుడు రవిబాబు కూడా నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అంశంపై స్పందించారు.

Film Director Ravi Babu Comments on chandrababu arrest
Film Director Ravi Babu Comments on chandrababu arrest

ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచించే చంద్రబాబు గారు, డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని ఫైర్‌ అయ్యారు. ఎటువంటి ఆధారం లేకుండా, అక్రమ కేసులు పెట్టి, చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారో అర్ధం కావటం లేదన్నారు సినీ దర్శకుడు రవిబాబు. కాగా నేడు చంద్రబాబుకు మద్దతుగా “మోత మోగిద్దాం” నిర్వహించనుంది టీడీపీ పార్టీ. నేడు చంద్రబాబు కు మద్దతుగా రాత్రి 7:00 నుండి 5 నిమిషాలు పాటు మోత మోగిద్దాం అంటూ ఆందోళనకు టిడిపి శ్రేణులకు నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news