ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం…ఎగిసిపడ్డ మంటలు

-

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉన్న రెండవ బ్లాక్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రెండో బ్లాక్ లోనే… పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, ఆనంద్ రామ్ నారాయణ, నారాయణ పేషీలకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి.

Fire breaks out at AP Secretariat

అయితే కార్యాలయాలు ఉన్న రెండవ బ్లాక్ లోనే ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మంటలు ఒకసారి పడటంతో… అధికారులు అలర్ట్ అయి వెంటనే ఫైర్ సిబ్బందిని రంగంలోకి దించారు. ఇక ఆ మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఇక ఈ సంఘటన ప్రమాదమా? లేక కుట్రనా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ అగ్ని ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news