లో ఫుడ్ పాయిజన్.. 17 మంది విద్యార్థులకు అస్వస్థత

-

యోగి వేమన విశ్వ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి వైవీయూ వసతి  గృహంలో భోజనం చేసిన తరువాత విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు. కొంత మంది అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లనే అస్వస్థతకు గురయ్యారని విద్యార్థులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రతిరోజు రాత్రి 7.30 నుంచి 9.30 వరకు భోజనం చేస్తారు. రాత్రి భోజనంలో అన్నం, వంకాయ కూర, రసం, పెరుగు విద్యార్థులకు వడ్డించారు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి భోజనం చేసే విద్యార్థులు రాత్రి 10.30 గంటలకు ప్రాంతంలో అస్వస్థతకు గురయ్యారు.

11 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వెంటనే తోటి విద్యార్థులు, సిబ్బంది యోగి వేమన యూనివర్సిటీ అంబులెన్స్ లో రిమ్స్ కి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందించారు.  విద్యార్థులతో పాటు రిమ్స్ కి వైస్ ఛాన్స్ లర్ ఆచార్య చింతా సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి రిమ్స్ కి చేరుకొని రాత్రి అంతా విద్యార్థుల వద్దనే ఉన్నారు. విద్యార్థులు కలుషిత ఆహారం తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారని విద్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేసారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news