అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో వాడింది కల్తీ నెయ్యేనని నిర్ధారణకు వచ్చింది. హైదరాబాద్ కు పంపిన శాంపిల్స్ ల్యాబ్ పరిశీలనలో వాస్తవాలు వెల్లడించారు అధికారులు. కొన్ని పూతరేకుల దుకాణాల్లోనాణ్యతలేని నెయ్యి వాడకం ఉందని తేలిపోయింది. గత నెల ఆహార భద్రత అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో లూజు నెయ్యి పేకెట్లు, బ్రాండ్ లేని నెయ్యి నమూనాలను గుర్తించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించాలన్న అత్యాశలతో కొందరు నాణ్యత లేని నెయ్యి వాడుతున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చింది.

ఫిబ్రవరి 17న ఆహార తనిఖీ అధికారులు నాలుగు బృందాలుగా చేసిన తనికీల్లో ఆత్రేయపురం పూతరేకులు దుకాణాల్లో ముద్రితం లేని 160 కిలోలు, నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. అనుమానం రావడంతో పలుచోట్ల 8 నమూనాలు సేకరణ చేశారు. వీటిని పరీక్ష కోసం హైదరాబాద్ లోని ప్రయోగశాలకు పంపడంతో ఇప్పుడు ఫలితాలు వెల్లడించారు. ఇందులో మూడు నమూనాల్లో కల్తీ జరిగినట్లు ల్యాబ్ పరీక్షల్లో గుర్తించారు. కల్తీ నెయ్యి వినియోగిస్తున్న పూతరేకుల దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు ఆహార భద్రతాధికారులు. ఇకపై నెయ్యి తయారీ తేదీ, లేకపోయినా, లైసెన్స్ లేకుండా. దుకాణాలు నడిపినా.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.