ఇదిగో చూడండి.. రేపు మీరు ఏం రాస్తారో మాకు తెలిసు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను మా నాయకుడికి అంటగట్టేస్తారు. అంతేకాదు, ఇది మాలో మేమే చర్చించుకున్నామని కూడా కలరింగ్ ఇస్తారు. కానీ, వాస్తవం ఇది కాదు..!- ఈ మాట అన్నది ఎవరో కాదు.. వైసీపీ సీనియర్ నాయకులు. విషయం ఏంటంటే. ప్రధాని నరేంద్ర మోడీ.. అవినీతి నిరోధక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో అవినీతి అంతు చూస్తామని.. ఇప్పటి వరకు అయిపోయింది అయిపోయింది.. కానీ, మేం అధికారంలో ఉన్నాం కాబట్టి.. అవినీతిని సహించేది లేదు.. అని వ్యాఖ్యానించారు.
దీంతో మీడియా మిత్రులు వైసీపీ నేతలకు ఫోన్లు కొట్టారు. సార్.. మోడీ చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారో చెప్పండి అన్నారు. దీంతో వారు సహజంగానే ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అలానే మాట్లాడతారు. ఇంత కన్నా.. ఆయన అవినీతిని ప్రోత్సహిస్తాను! అని ఆ కార్యక్రమంలో చెప్పలేరు కదా! ఏ కార్యక్రమానికి వెళ్తే .. ఆ కార్యక్రమం లైన్‌ను బట్టి మాట్లాడడం సహజం. సో.. దీనిపై పెద్దగా స్పందించాల్సిన అవసరం ఏం ఉంటుంది ? అని ఎదురు ప్రశ్నించారు. అయినా కూడా వైసీపీ నేతలను సదరు మీడియా ప్రతినిదులు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. దీంతో వారు.. మీరుఏం రాస్తారో మాకు తెలుసు. మా నాయకుడు జగన్ గురించే మోడీ ఇలా వ్యాఖ్యానించారని రాస్తారు. అంతే కదా.. రాసుకోండి. అనిచెప్పారు.
కట్ చేస్తే.. ఈ విషయంపై వైసీపీ నేతలు మరో మాట చెప్పారు. నిజానికి అవినీతి అనేది అంతం చేయాలని అంటే.. ప్రస్తుతం గుజరాత్ నేతలపై ఉన్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అదే సమయంలో బీహార్‌లోనూబీజేపీ నేతలు అవినీతి కేసుల్లోనే ఉన్నారు. పైగా మోడీ సానుకూల పార్టీలు ఎక్కువగా అవినీతి కూపంలోనే ఉన్నాయి. దీంతోఎవరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేయగలరు. ఇదంతా కూడా రాజకీయ హంబక్! దీనిని చిలవలు పలవలు చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు.
ప్రస్తుతం బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ బీజేపీకి గట్టిగా పోటీఇస్తున్నపార్టీ ఆర్జేడీ. ఆ పార్టీ అధినేత అవినీతి కేసుల్లోజైల్లో ఉన్నారు. ఆయనను దృష్టిలోపెట్టుకుని.. ఓటు బ్యాంకు కోసం మోడీ ఇలా వ్యాఖ్యానించారని మేం అనుకుంటున్నాం. అన్నారు. మొత్తానికి ఈ రెండు విషయాలు చాలా ఆసక్తిగా మారడం గమనార్హం.