వైయస్ విజయమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఈ ఇద్దరు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాటు వద్ద కలుసుకోవడం జరిగింది. ఇవాళ వైయస్సార్ జయంతి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్సార్ ను గుర్తు చేసుకుంటూ చాలామంది కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పిస్తున్నారు.

ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేపథ్యంలో నిన్ననే కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ఇక ఇవాళ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ దగ్గర నివాళులు కూడా అర్పించారు. ఇడుపులపాయలోని…రాజశేఖర్ రెడ్డి ఘాట్ దగ్గర నివాళులు కూడా అర్పించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ కూడా అక్కడికి వచ్చారు. దీంతో తన కొడుకును ప్రేమగా హద్దుకుంది తల్లి విజయమ్మ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
నేడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి #YSRJayanthi pic.twitter.com/ouMrRRQRyo
— BIG TV Breaking News (@bigtvtelugu) July 8, 2025