చంద్రబాబు ఉత్తుత్తి పుత్రుడు లోకేష్, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ : కొడాలి నాని

-

పొత్తు రాజకీయం పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. జగన్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చాడు.. చంద్రబాబు ఉత్తుత్తి పుత్రుడు లోకేష్, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అని చురకలు అంటించారు కొడాలి నాని.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి అడుక్కు తినండి…ఒకరి సంక ఒకరు నాకండి… మాకు అభ్యంతరం లేదని.. రాష్ట్ర ప్రజలు అమాయకులు, మేం ఏం చెబితే అదే నమ్ముతారు అనే భ్రమల్లో ఉన్నారని ఫైర్ అయ్యారు.

జగన్‌కు ఉన్న 55 శాతం ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు.. మిగిలిన 45 శాతం ఓట్లలో ఎవరు ఎన్ని తెచ్చుకోగలరో తేల్చుకోండని హెచ్చరించారు. 2019లో విడి విడిగా వస్తే పులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో చూశారు.. ఇప్పుడు గుంపులుగా వస్తాయంటున్నారన్నారు. 2019కి ముందు నేనే ఏలాస్తాను, మోడీని పడగొట్టేస్తాను అని దేశం పట్టి తిరిగిన తర్వాత ఏమయ్యింది?? 23 స్థానాలకు పరిమితం కాలేదా?? అని అగ్రహించారు.

జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉంటే ఇంకొకళ్ళ సంక నాకటం ఎందుకు? చంద్రబాబుకు 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు అని ఎద్దేవా చేశారు. జగన్ చేతిలో చంద్రబాబు చావుదెబ్బ తింటాడు.. 1977లో ఎమర్జెన్సీ సమయంలో విపక్షాలు అన్నీ కలిసి వచ్చాయని పవన్ కళ్యాణ్ థియరీ చెబుతున్నాడు.. పోటీ చేసిన తర్వాత ఏమయ్యింది?? అని ప్రశ్నించారు. 14 నెలలు తిరగ్గానే ప్రజలే అందరినీ నేలకేసి కొట్టారు.. ఈ సమతా పార్టీ, బొంగు, గింగులన్నీ గాలికి కొట్టుకు పోయాయని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version