పరిటాల సునీత 10 మందిని చంపించిందన్న వైసీపీ నేత !

-

పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే, వైసిపి కీలక నేత ప్రకాశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరిటాల సునీత పది మందిని చంపించిందని వైసీపీ నేత ప్రకాష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నీ భర్త 100 కూనీలు చేయించాడని.. రాష్ట్రమంతా తెలుసంటూ పరిటాల సునీతకు కౌంటర్ ఇచ్చారు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చాక దాదాపు పదిమంది నీ డైరెక్టుగానో లేదా ఇన్ డైరెక్ట్ గానూ… చంపించామంటూ ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.

అప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విచారణకు… వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆదేశించినట్లు గుర్తు చేశారు. కానీ 100 హత్యలు చేసిన పరిటాల రవి కేసుల నుంచి ఎలా తప్పించుకున్నాడు… అంటూ నిలదీశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత కుమారుడిపై సిబిఐ కేసు వేయించారు అంటూ పరిటాల సునీతకు కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news