భూముల విషయంలో ప్రభుత్వానికి మేము చెబితే వింటారా..? మా మాట వింటారా..? మేము అభిప్రాయం చెప్పామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు మిత్ర బంధాలు వేరు.. ప్రస్తుత HCU భూముల సమస్య అని చెప్పారు. రాజకీయాల్లో ఎవరికీ ఎవరు శాశ్వత మిత్రులు కాదు.. శాశ్వత శత్రువులు కాదన్నారు. ఇందిరాగాంధీ హయాంలో HCU కి భూములు కేటాయించారని వివరించారు.
భూముల ధరలు పెరగడంతో అందరి కన్ను సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడిందన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కేర్ ఆసుపత్రి యాజమాన్యం అక్కడ ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందని.. విద్య వ్యవస్థకే ఆ భూములను అప్పట్లోనే మేము స్పష్టం చేశామని గుర్తుకు చేశారు. విద్యా వ్యవస్త విస్తృతికి ఈ భూములను ఉపయోగించాలని ఆయన కోరారు. జనం పెరుగుతుంది కానీ.. భూమి పెరగదు కదా.. ప్రభుత్వ భూములను అమ్మకూడదన్నారు. గత ప్రభుత్వాలు భూములు అమ్మారు అంటున్నారు. వాళ్లు అపోజిషన్ ఉన్నారు కదా.. చట్ట ప్రకారం.. ప్రభుత్వానికి ఈ బూములు వచ్చాయని.. రేవంత్ రెడ్డికి భూములు ఇవ్వలేదని నారాయణ వివరించారు.