రైతుల భూములు లాక్కొని.. ఎదురుతిరిగిన అన్నదాతల అరెస్టు

-

సీఎం రేవంత్ సర్కార్ రైతుల భూములు లాక్కుని.. ఎదురుతిరిగిన వారినే అరెస్టు చేస్తోందని ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్తిలో ఫార్మా సిటీకి భూమి సేకరించి, హద్దు రాళ్లు పాతడానికి 200 మంది పోలీసు బందోబస్తుతో అధికారులు వచ్చారు.

కోర్టులో స్టే ఉన్న తమ పట్టా భూముల్లోకి ఎలా వస్తారని అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి ఎదురుతిరిగిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైతులపై దౌర్జన్యం ఆపాలని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news