మాజీ ఎంపీ నందిగం సురేష్ కి ఈనెల 21 వరకు రిమాండ్..!

-

బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత నందిగం సురేష్ ను ఇటీవలే ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డీఎస్పీ మల్లికార్జున రావు నేతృత్వంలో నందిగం సురేష్ మియాపూర్ లో ఉండగా సెప్టెంబర్ 05న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం పై జరిగిన దాడి ఘటనలో తొలుత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళగిరి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టగా.. టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేష్ అరెస్ట్ అయి గుంటూరు జిల్లాలో ఉన్నారు. 

ఇటీవలే హై కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో సురేష్ జైలులోనే ఉన్నారు. తాజాగా మరో కేసులో మరోసారి అరెస్ట్ చేశారు. మరోవైపు మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ కు అనుమతించడంతో తాజాగా మరియమ్మ అనే మహిళా హత్య కేసులో తూళ్లురు పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఈనెల 21 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. 2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ మరణించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version