Former YCP Minister Avanti Srinivas Good Bye: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. విశాఖలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ వీడేందుకు సిద్ధం అయ్యారట కీలక నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.
కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టుగా అవంతి శ్రీనివాస్ ఉంటున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచి మంత్రి అయ్యారు అవంతి శ్రీనివాస్. వైసీపీ హయంలో పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు అవంతి శ్రీనివాస్. వైసీపీ ఏపీలో ఓడిన ఇలాంటి నేపథ్యంలో అవంతి పార్టీ వీడిట్టంపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే.. వైసీపీ పార్టీకి రాజీనామా చేసి.. జనసేన, లేదా బీజేపీలోకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.