ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో చదివే విద్యార్థులకు శుభవార్త అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో టెన్త్, ఇంటర్ చదివి జిల్లా టాపర్లుగా నిలిచిన వారికి ప్రభుత్వం తమ వంతు సహాయం అందించనుంది. ప్రతి జిల్లాలలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలకు రూ. 10,000 చొప్పున డబ్బులు అందించనుంది.

స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఈ బహుమతులను ఇవ్వబోతున్నారు. స్కూళ్లు, కాలేజీలలో జిల్లా స్థాయిలో ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ సూచనలు జారీ చేసింది. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించాలని ఆదేశించింది. కాగా, రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కారణంగా జిల్లా టాపర్లకు డబ్బులు అందించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు స్కూళ్లు, కాలేజీలలో జెండాను ఎగరవేసి వారి దేశభక్తిని చాటుకొనున్నారు.