కోటి భగవద్గీత పుస్తకాలు ఉచితంగా పంపిణీ : టీటీడీ ఛైర్మన్‌ భూమన

-

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సనాతన హిందూ ధర్మాన్ని విస్తరించడంలో భాగంగా కోటి భగవద్గీత పుస్తకాలను తెలుగు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ముద్రించి విద్యార్థులకు ఫ్రీగా అందిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

చెన్నైలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… ‘పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలతో ధర్మ ప్రచారం చేస్తామన్నారు. తిరుమల నడకదారిలో భక్తుల భద్రతపై రాజీలేదు. కేంద్ర అటవీశాఖ అనుమతులు రాగానే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.

ఇది ఇలా ఉండగా, కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వారి భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. నిన్న 54, 620 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీ వారి హుండీకి రూ. 2.98 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version