కిశోర బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ నాప్‌కిన్ల పంపిణీ – మంత్రి విడ‌ద‌ల ర‌జిని

-

కిశోర బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ నాప్‌కిన్ల పంపిణీ చేస్తున్నట్లు ప్రకటన చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని. కిశోర బాలిక‌లకు మంచి ఆరోగ్యం అందించ‌డం కోసం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారు ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ సంస్థ‌ కింబెర్లీ- క్లార్క్ సంస్థ ఏపీ ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు చేయూత‌గా కిశోర బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ నాప్‌కిన్ల పంపిణీ నిర్ణ‌యం తీసుకుంది.

వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌త్యేక చొర‌వ నేప‌థ్యంలో ఆ సంస్థ నాప్‌కిన్ల పంపిణీకి ముందుకు వ‌చ్చింది. ఏకంగా 2.3ల‌క్ష‌ల నాప్‌కిన్లు, 300 కేసుల వ‌ర‌కు డైప‌ర్ల‌ను ఆ సంస్థ వైద్య ఆరోగ్య‌శాఖ‌కు అంద‌జేసింది. వీటి విలువ రూ.25 ల‌క్ష‌ల‌కు పైగా ఉంటుంది. విడ‌త‌ల వారీగా మ‌రికొన్ని అందించేందుకు కూడా ఆ కంపెనీ అంగీక‌రించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు మాట్లాడుతూ కిశోర బాలిక‌లకు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా స్వేచ్ఛ కార్య‌క్ర‌మం ద్వారా త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తి నెలా 12 ల‌క్ష‌ల శానిట‌రీ నాప్‌కిన్ల‌ను ఉచితంగా అంద‌జేస్తోంద‌ని, ఈ కార్య‌క్ర‌మానికి కింబెర్లీ – క్లార్క్ సంస్థ కూడా చేయూత‌ను అందించ‌డం గొప్ప విష‌య‌మ‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో కంపెనీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news