99 శాతం హామీలను నెరవేర్చా : సీఎం జగన్

-

ఒక జాతీయ పార్టీ రాష్ట్రాన్ని విడగొడితే, మరో పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందని సీఎం జగన్ విమర్శించారు. ఇవాళ నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన మేమంతా సిద్దం బహిరంగ సభలో ప్రసంగించారు జగన్. చంద్రబాబు మంచి చేసి ఉంటే 3 పార్టీలతో కలిసి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. నేను తొలిసారి సీఎంగా 58 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి పేదల ఖాతాల్లో డబ్బులు జమా చేసినట్టు తెలిపారు. మేనిఫెస్టో ని పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను నేరవేర్చినట్టు తెలిపారు.

ఇంటింటికి పౌరసేవలు డోర్ డెలవరీ చేయిస్తున్నానని చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తుకు రాదని జగన్ విమర్శించారు. అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అన్నారు. 14 ఏళ్లు సీఎం గా ఉన్నానని చెప్పుకుంటున్నావు. పేదల కోసం ఒక్క స్కీమ్ అయినా తీసుకొచ్చావా..? మేనిఫెస్టోలో 10 శాతం హామీలు అమలు చేశానని చెప్పే ధైర్యం ఉందా..? మీ బిడ్డ హయాంలో ప్రతీ ఇంటికి మంచి జరిగింది. జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్దమేనా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version