విశాఖ ఉక్కు పరిశ్రమ మూసేయడమే ప్రభుత్వ అంతిమ నిర్ణయం అయితే తన పదవికి రాజీనామా చేస్తానని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ ప్రకటించారు. రాజీనామా చేసి కార్మికులతో కలిసి పరిరక్షణ పోరాటంలో కొనసాగుతానని ఆయన చెప్పారు. అయితే గత రెండు రోజులుగా RINL లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. రా మెటీరియల్ కొరతను కారణంగా చూపించి బ్లాస్ట్ ఫర్నేస్ -3 మూసి వేసింది యాజమాన్యం. దశలవారీగాప్లాంట్ షట్ డౌన్ చేసేందుకు యాజమాన్యం ప్రయత్నం చేయ డంపై కార్మిక వర్గాలు ఆందోళన ఉధృతం చేస్తున్నాయి.
అయితే కూర్మన్నపాలెం దగ్గర స్టీల్ కార్మికుల దీక్షా శిబిరం దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే పల్లా, ఎంపీ శ్రీ భరత్ ఆందోళనలో ఉన్న కార్మికులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు వ్యతిరేకిస్తూ గాజువాక జంక్షన్ లో సిఐటియు మహాధర్నా కు పిలుపు ఇచ్చింది.