పరకామణి చోరీ వ్యవహారంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరకామణి చోరీ వ్యవహారం జరిగిందని నిజమని నిరూపిస్తే నా తల అలిపిరిలో నరుక్కుంటా అంటూ సవాల్ విసిరారు. కూటమి నేతలు అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు.

అటు నిన్నటి రోజున టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకామణి అవకతవకలపై భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పరకామణిలో రూ.100 కోట్ల చోరీ జరిగిందని బాంబ్ పేల్చారు. అప్పటి పెద్దలు స్వామివారి పేరుతో రూ. 40 కోట్ల ఆస్తులను రాయించుకున్నారని వెల్లడించారు. ఎవరిని తప్పించడానికి అప్పటి అధికారులు రాజీకి వెళ్లారు? అని నిలదీశారు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి. రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ రికార్డుల్లో ఉందన్నారు. రాజీ కుదిర్చిన అధికారులు ఎవరు? అని ప్రశ్నించారు భాను ప్రకాష్ రెడ్డి.