గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు..!

-

Gannavaram Airport is named after NTR: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీలో ఉన్న చాలా ఎయిర్‌పోర్టుల పేర్లు మార్చాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే… గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిసైడ్‌ అయింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.

Gannavaram Airport is named after NTR

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు శ్రీవేంకటేశ్వర పేరు పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుందట ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లను పెట్టాలని కేంద్రాన్ని కోరిందట ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిపై ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు చర్చించనున్నారట.

కాగా, ప్రధాని మోడి అధ్యక్షతన ఈ రోజు తొమ్మిదవ “నీతి ఆయోగ్” పాలక మండలి సమావేశం జరుగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతిభవన్ లోని “కల్చరల్ సెంటర్” లో ప్రధాని మోడి అధ్యక్షతన ఈ రోజు తొమ్మిదవ “నీతి ఆయోగ్” పాలక మండలి సమావేశం ఉంటుంది. దీనికి చంద్రబాబు హాజరుకానుండగా తెలంగాణ తో సహా, 6 రాష్ట్రాలు సమావేశాన్ని బహిష్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news