వైసీపీ రౌడీలను అరెస్ట్‌ చేయాల్సిందే..చంద్రబాబు ఇష్యూపై గంటా సీరియస్‌

-

వైసీపీ రౌడీలను అరెస్ట్‌ చేయాల్సిందేనని..చంద్రబాబు ఇష్యూపై గంటా శ్రీనివాస్‌ రావు సీరియస్‌ అయ్యారు. చంద్రబాబుపై నిన్న రాత్రి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం వస్తుండగా అధికార వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం దురదృష్టకరం, చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వడం ద్వారా కొందరు టీడీపీ కార్యకర్తకు మరియు ఎన్ఎస్‌జీ కమాండర్ సంతోష్ కుమార్‌ తలకు గాయం కావడం వైసీపీ రౌడీ రాజకీయానికి ఇది పరాకాష్ట. చంద్రబాబు గారు మరియు లోకేష్ గారి సభలకు వస్తున్న ప్రజా స్పందన చూసి వైసీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయని వెల్లడించారు.


గతంలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కు ఇదేవిధంగా మేము అడ్డంకులు సృష్టించి ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా.? ప్రజాస్వామ్యం లో ఇలాంటి దాడులను ప్రోత్సహించడం ఏ రాజకీయ పార్టీ కి మంచిది కాదు, దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను.ఆదిమూలపు సురేష్‌ ఒక మంత్రి హోదాలో హుందాగా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి, చట్టాన్ని గౌరవించాల్సిన మంత్రే చొక్కాలు చించేసుకొని వారి అనుచరులను చంద్రబాబు గారి పై రాళ్ళ దాడి చేయించడం చూస్తుంటే మీ ప్రవర్తన ఒక వీధి రౌడీ కి ఏ మాత్రం తీసిపోలేదు అనిపిస్తుందని నిప్పులు చెరిగారు గంటా శ్రీనివాస్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version