వైసీపీలోకి నేనే వెళ్లను..టీడీపీని వదులుకోను అంటూ గంటా శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయని.. వాటిని నేను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు గంటా. తాను పార్టీ మారుతున్నట్లు ఎప్పుడూ మాట్లడలేదని.. మారితే కచ్చితంగా చెబుతానని వెల్లడించారు.
కాపు బహిరంగ సభను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు గంటా. రంగా ఒక కులానికో, లేదా మతానికో నాయకుడు కాదని.. అన్ని కులాలు, బలహీన వర్గాలకు బంధువు లాంటోడని కొనియాడారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు గంటా శ్రీనివాస్.