NBKwithPrabhas : బాలయ్య షోలో గోపిచంద్‌, ప్రభాస్‌ రచ్చ..

-

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా రెండవ సీజన్ ను ప్రారంభించడం జరిగింది. ఇందులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేష్ మొదటి ఎపిసోడ్లో గెస్ట్ గా వచ్చి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు.

అంతేకాకుండా అన్ స్టాపబుల్ షో లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, బాలయ్య రెస్పాన్స్ పొలిటికల్ హీట్ ను మళ్లీ తెరలేపాయని చెప్పవచ్చు. ఇక తాజాగా బాలయ్యకు షోలో టాలీవుడ్‌ హీరోలు ప్రభాస్‌, గోపిచంద్‌ మెరిసారు. ఈ షో కు సంబంధించిన ఫోటోలను ఆహా కాసేపటి క్రితమే రిలీజ్‌ చేసింది. అయితే, ఈ షో ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుందో మాత్రం ఆహా ప్రకటించలేదు. ఈ వారం చివరల్లో ప్రసారం అయ్యే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news