ఇంటికొచ్చి కాళ్లు విరగ్గొడతా – మంత్రి అప్పలరాజుకు గౌతు శిరీష వార్నింగ్

-

పలాస రాజకీయ రగడ అంతకంతకూ వేడెక్కుతుంది. మంత్రి సిదిరి అప్పలరాజు, టిడిపి మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 2019 ఎన్నికల తర్వాత మొదలైన ఈ పొలిటికల్ వార్ ఇప్పుడు వార్నింగ్ లు ఇచ్చుకునే వరకు వెళ్ళింది. మంత్రి అప్పలరాజు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని శిరీష ఇటీవల రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల మంత్రి అప్పలరాజు గౌతు శిరీషపై తీవ్ర విమర్శలు చేశారు.

” శిరీష, ఆమె భర్త నా కాలిగోటితో సమానం. ఆమెలో పొగరు, బలుపు తప్ప ఏమీ లేవు. వారి కుటుంబం వల్లే పలాస నాశనమైంది” అని అన్నారు మంత్రి అప్పలరాజు. దీంతో మంత్రి విమర్శలపై స్పందించారు గౌతు శిరీష. ” పలాసలో టిడిపి నేతలపై దాడులు చేసిన వారిపై కఠిన సెక్షన్లు ఎందుకు నమోదు చేయడం లేదు. నాపై దాడి చేసి చూడు ఏం జరుగుతుందో. వ్యక్తిగత విషయాల జోలికి వస్తే ఇంటికొచ్చి కాళ్లు విరగ్గొడతా ” అంటూ మంత్రికి వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version