టీడీపీ నేతలను చీపుర్లు, చెప్పులతో కడతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన … చంద్రముఖి పాలనలా సాగుతుందని చురకలు అంటించారు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న … రాష్ట్ర అబివృద్ది జరగలేదని ఫైర్ అయ్యారు.
టిడిపి నాయకులు కండువా వేసుకొని గ్రామాల్లోకి వెళ్తే మహిళలు చీపుర్లతోను … మగవాల్లు చెప్పులతోను … కొడతారని వార్నింగ్ ఇచ్చారు. మొదటి సంతకం మెగా డిఎస్సి పై పెట్టారు … కానీ … మెగా డిఎస్సీ జాడలేదని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో భూదోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. బినామీ పేర్లు తో భారీ ఎత్తున భూ దోపిడి జరుగుతుందని ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్శయ్య.