ఏపీలో 1000 మంది అబ్బాయిలకు 953 మంది అమ్మాయిలు

-

ఆంధ్ర ప్రదేశ్​లో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో చాలా అంతరం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 953 మంది అమ్మాయిలే పుడుతున్నారని తెలిపారు. 2016-17లో 946 మంది పుట్టగా 2021-22 నాటికి హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టంలో నమోదైన ప్రకారం 953 మంది అమ్మాయిలు జన్మించారని చెప్పారు. ఆరేళ్లలో అమ్మాయిల జననాల నిష్పత్తి 7 మాత్రమే పెరిగిందని వెల్లడించారు.

ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 994, గుంటూరు జిల్లాలో 986, నెల్లూరు జిల్లాలో 970 మంది చొప్పున అమ్మాయిలు జన్మించారు. 2016-17తో పోలిస్తే.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం, కడప జిల్లాలో అమ్మాయిల జననం తగ్గింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రతి శిశు జననం అధికారిక వెబ్‌సైట్‌లో నమోదవుతుంది.

కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అమ్మాయిల విషయంలో వివక్ష చూపకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికలు అమలుచేస్తున్నారు. జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధ్యయనం-4 (2015-16), 2019-20 (అధ్యయనం-5) ప్రకారం తెలంగాణలో  ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 919, 929 మంది చొప్పున అమ్మాయిలు జన్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version