ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముందు బాబులకు ఆంధ్రప్రదేశ్ చెప్పిందే చంద్రబాబు నాయుడు సర్కార్. కొత్త సంవత్సరం వచ్చిన నేపథ్యంలో… ఫుల్ పర్మిషన్స్ ఇచ్చింది. ఇవాళ అలాగే రేపు అర్ధరాత్రి వరకు… మద్యం దుకాణాలు ఓపెన్ గా ఉంటాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అర్ధరాత్రి ఒకటి గంటల వరకు వైన్స్, బార్లు, క్లబ్బులు, అలాగే ఈవెంట్లకు అనుమతి ఇస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
న్యూ ఇయర్ సందర్భంగా మద్యం వినియోగం విపరీతంగా ఉంటుంది. సాధారణంగా రాత్రి 10 గంటలకు మద్యం దుకాణాలు మూసివేస్తారు. కానీ కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో… అలాగే బెల్టు షాపుల దోపిడీని అరికట్టేందుకు… అర్ధరాత్రి ఒకటి గంటల వరకు వైన్స్, బార్లు, క్లబ్బులు, అలాగే ఈవెంట్లకు పర్మిషన్స్ ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఇక చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రకటనతో…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముందు బాబులు ఖుషీ అవుతున్నారు.