ఏపీ కళా కారులకు మంత్రి కందుల వరాలు..ఆ బకాయిలు విడుదలు !

-

ఏపీ కళా కారులకు పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వరాలు ప్రకటించారు. విజయవాడలో ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకట రత్నం నాయుడు కాంస్య విగ్రహం ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్నారు పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ముఖ్య అతిధిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…తెలుగు బాషా పై, కళరంగం పై అభిమానం వున్నా వారు మండలి బీద్ద ప్రసాద్ గారు… నాటక రంగం ఎంతో విశిష్టమైనది, సినీ పరిశ్రమకి ఏ మాత్రం తీసిపోని రంగం అన్నారు.

State Minister Kandula Durgesh inaugurated the cricket tournament held at the SP office ground in Rajahmundry

ఎన్టీఆర్ గారి చే ప్రశంసలు అందుకున్న గొప్ప నటులు అని.. నాటక రంగము ప్రభావం సినీ రంగం పై చాలా వుందని తెలిపారు. నాటకాన్ని అభిమానించే వారు చాలా మంది వున్నారు… నాటక రంగం బ్రతికి ఉండాలి అంటే ప్రభుత్వం అండ ఉండాలని తెలిపారు. గత 5 సంవత్సరాల నుండి కళ రంగం నిర్వీర్యం అయ్యిందని వెల్లడించారు. NDA కూటమి నాటక రంగాన్ని ఆదుకుంటామని… మీకు వున్నా బకాయిలు వెంటనే చెల్లిస్తామని గుడ్‌న్యూస్ చెప్పారు పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పేద కళ కారులను ఆదుకుంటామని.. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటు కి కృషి చేస్తామన్నారు. పుణ్యక్షేత్రల్లో నాటకాలు ప్రదర్శన జరిగితే కళాకారులకు అండగా ఉండొచ్చు… మీకు ఏ సమస్యలు వున్నా నా దృష్టికి తీసుకురండి నేను ప్రభుత్వం తో మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం చేస్తానని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version