ఏపీ రైతులకు శుభవార్త… 48 గంటలలోపే డబ్బులు జమ అవుతున్నాయి. ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిన…48 గంటలలోపే డబ్బులు జమ అవుతున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. రైతుకి ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడండి….మీ చేతగాని పాలనలో ఈ సమయానికి- కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని వైసీపీ పార్టీని ఉద్దేశించి.. చురకలు అంటించారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.
బాధ్యత కలిగిన మా కూటమి ప్రభుత్వం 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. 48 గంటలలోపే డబ్బులు జమ చేస్తున్నామని వివరించారు. జగన్ పాలనలో ఏ రోజైనా రైతులకి సక్రమంగా డబ్బులు చెల్లించారా ? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. కనీసం గోతాలు కూడా సరిపడా ఇవ్వలేకపోయారు… రైతులను దగా చేసిన మీకు ర్యాలీలు చేసే అర్హత ఉందా ? అని నిలదీశారు.
రైతుకి ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడండి.
మీ చేతగాని పాలనలో ఈ సమయానికి- కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.
బాధ్యత కలిగిన మా కూటమి ప్రభుత్వం 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాము. 48 గంటలలోపే డబ్బులు జమ చేస్తున్నాము. జగన్ పాలనలో ఏ రోజైనా… pic.twitter.com/hvvoFtEuSs— Manohar Nadendla (@mnadendla) December 11, 2024