పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు ఏపీ సీఎం జగన్. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2014 ఏప్రిల్ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న 2146 మంది క్రమబద్దీకరణకు నిర్ణయం తీసుకున్నారు.
ఇక అటు చంద్రబాబు పేరు చెబితే మోసాలు దాగాలు గుర్తుకు వస్తాయి…దత్త పుత్రుడు పేరు చెబితే అమ్మాయిల మోసం చేసే విషయాలు గుర్తుకు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. అనకాపల్లిలో వరుసగా నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు వైయస్ఆర్ చేయూత ద్వారా ఒక్కొక్కరికి మొత్తం రూ. 75,000 ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్. ఈ సందర్భంగా 2014 ఎన్నికల లో జనసేన- టీడీపీ మ్యానిఫెస్టోలో అంశాలను ప్రస్తావించి వైఫల్యాలను ఎత్తి చూపించారు జగన్.