ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సర్వీసులు రద్దయినప్పుడు డ్రైవర్, కండక్టర్లకు నిర్బంధ సెలవు ఇవ్వకుండా, ఆన్ డ్యూటీ గా పరిగణిస్తారు. ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవులు ఇస్తారు. హెడ్ క్వార్టర్ నుంచి 6 గంటల పైబడి ఉన్న సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్, కండక్టర్, అధికారులకు డీఏ రూ.150-300 చెల్లిస్తారు. అలాగే నైట్ హాల్ట్ ఉండే గ్రామాల్లో డ్రైవర్, కండక్టర్లకు సౌకర్యాలు కల్పించనున్నారు.
ఇక అటు అసైన్డ్ భూములకు నష్టపరిహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల కోసం లేదా భూసేకరణ నిమిత్తం భూములు వెనక్కి తీసుకుంటే మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇకపై అసైన్డ్ భూములు కలిగినవారికి ఇతర భూముల యజమానులతో సమానంగా మార్కెట్ విలువ ప్రకారమే చెల్లింపులు ఉంటాయని రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు.